తుంగభద్ర పుష్కరాలు.. వారికి అనుమతి లేదు !
తుంగభద్ర పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కఠినంగానే నిబంధనలు రెడీ చేసింది.
తుంగభద్ర పుష్కరాల గైడ్ లైన్స్ :
* 12 యేళ్లలోపు పిల్లలను, 60 ఏండ్లు పైబడిన వృద్ధులను పుష్కరాలకు అనుమతించడం లేదు.
* పుష్కరాలకు హాజరయ్యే వారు గుర్తింపు కార్డుతో పాటు ఈ-పాస్ తీసుకురావాలి
* ఈ-పాస్ కోసం పుష్కరాలకు 10 రోజుల ముందు మాత్రమే వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది.
* పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు.. వెబ్సైట్లో డైరెక్ట్‌గా లేదా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. వచ్చిన మెసేజ్‌లను పుష్కరఘాట్‌లో అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
* వెబ్సైట్లో పుష్కరఘాట్లు ఉండే ప్రదేశం, రవాణా సదుపాయానికి చేసిన ఏర్పాట్లను కూడా పెట్టారు
* ఘాట్ల వద్దకు వచ్చేవారు నిర్ణీత సమయాల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది
* ఘాట్ల వద్ద కేవలం 15 నిముషాలు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత సానిటైజ్ చేసి మరో బ్యాచ్ ను ఘాట్‌కు అనుమతిస్తారు
* ప్రతి ఘాట్ వద్దకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది
* తుంగభద్ర పుష్కరాలకు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. ఆంక్షలు, సౌకర్యాలపై ఆయా రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ లో సమాచారం చేరవేయనున్నారు అధికారులు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు.