బిగ్ బాస్ : నోయల్ సెల్ఫ్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 8వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిన నాగార్జున వచ్చేశారు. నేటి ఏపీసోడ్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులకి షాక్ తగిలింది.
ఈ ప్రోమోలో నోయల్ ఎలిమినేట్ అయినట్టు కనిపిస్తోంది. అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయిందన్న మాట. అనారోగ్యంతో నోయల్ శుక్రవారం బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకి చికిత్స అనంతరం తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారని అందరు భావించారు. కానీ తాజా ప్రోమోతో నోయల్ సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇక నాగ్ తో కలిసి స్టేజ్ పైకి వచ్చిన నోయల్.. అమ్మ రాజశేఖర్, అవినాష్ లకి ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. గతంలో తన ఆరోగ్యంపై కామెంట్ చేసిన వారికి బుద్ది చెప్పే ప్రయత్నం చేశారు.