ఐపీఎల్’లో ట్రెండ్ మారింది.. టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్’నే !
ఐపీఎల్ 13 ఆఖరి అంకానికి చేరుకుంది. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా మొదట ఫీల్డింగ్ నే ఎంచుకుంటున్నాయ్. నిన్న జరిగిన మ్యాచ్ లో తమ ఓటమికి కారణం టాస్ ఓడిపోవడమే కారణమని పంజాబ్ కెప్టెన్ కె ఎల్ రాహుల్ వాపోయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ? రాత్రి వేళలో మంచు కురుస్తుండంతో బంతిపై గ్రిప్ పోతోంది. తద్వారా ప్రత్యర్థిని కట్టడి చేయడం కష్టవుతోందని చెబుతున్నారు.
తాజాగా బెంగళూరుతో హైదరాబాద్ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లేఆఫ్ కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్ మాత్రమే కాదు.. వచ్ఛే మ్యాచ్ లోనూ గెలుపొందాలి. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ అదే జోరులో బెంగళూరుపై కూడా నెగ్గితే.. ఫ్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడినట్టే.