స్కూల్స్, కాలేజీల ఓపెనింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన !
ఏపీ ప్రభుత్వం స్కూల్స్, కాలేజీల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 2 నుంచి ఏపీలో బడి గంటలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అనుసరించాల్సిన గైడ్‌లైన్స్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఆందోళన పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సామాజిక దూరం, మాస్కుల ధారణ కంపల్సరీ అని చెప్పారు.
నవంబర్ 2 నుంచి స్కూళ్లలో 9, 10 క్లాసులతో పాటు ఇంటర్ సెకండియర్ తరగతులను ప్రారంభిస్తాం. నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు జరుగుతాయి. నవంబర్ 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించనున్నాం. డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభిస్తాం. నవంబర్ 2 నుంచి ఆరు వారాల తర్వాత ప్రైమరీ స్కూళ్లు తెరుస్తాం. నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను ప్రారంభిస్తాని తెలిపారు.