స్కూల్స్ ఓపెన్.. ఏపీ ప్రభుత్వం సూపర్ హిట్ !
ఏపీలో స్కూల్స్, కాలేజీలు తెరచుకున్నాయ్. ఈ విషయంలో ఎన్ని అనుమానాలు, అభ్యంతరాలు వచ్చినా.. ఏపీ ప్రభుత్వం స్కూల్స్ తెరిచేందుకే మొగ్గు చూపింది. ఇవాళ ఏపీలోని స్కూల్స్ , కాలేజీలు తెరచుకున్నాయ్. విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువగా హాజరుశాతం ఉంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. స్కూల్స్ వస్తామని విద్యార్థులు ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.
ఇక ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకున్న పనిదినాల్లో 144 రోజులు క్లాసుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
స్కూల్స్, కాలేజీల ఓపెనింగ్ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ న్స్ ఇలా ఉన్నాయ్ :
* నవంబరు నెలాఖరు వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలి. నవంబరులో ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించి డిసెంబరులో నిర్ణయాలు తీసుకుంటారు.
* ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. వారంతా ఆరడుగుల దూరం పాటించాలి. విద్యార్థుల సంఖ్య 750కి మించితే 3విభాగాలుగా చేసి 3 రోజులకోసారి హాజరయ్యేలా చూడాలి.
* విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎడం పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు ప్రశాంతంగా ఉండే ఇతర స్థలాలను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరుకావాలి.
* అన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షిక క్యాలెండర్ను అనుసరిస్తూ తరగతులను నిర్వహించాలి. హాజరైనవారికి మధ్యాహ్న భోజనం అందించాలి.
* 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు కూడా దగ్గరలోని పాఠశాలల్లో రోజువారీ హాజరుకావొచ్చు. అక్కడ వారికి మధ్యాహ్నభోజనం పెట్టాలి.
* 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈనెల 2 నుంచి వసతిగృహాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ సంబంధిత సంస్థలు సన్నద్ధంగా లేనట్లయితే 23లోపు ఎప్పుడైనా తెరచుకోవచ్చు. ఈలోగా విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతోపాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి.