అతిథి హీరోయిన్’కి బాబు పుట్టాడు
‘అతిథి’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన కథానాయిక అమృతరావు ఆదివారం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘అమృతరావు, ఆర్జే అన్మోల్ దంపతులు మగ శిశువుకు స్వాగతం పలికారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అభిమానుల అభినందనలు, ఆశీర్వాదాలకు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
2016లో అన్మోల్ను వివాహం చేసుకున్నారు. గత నెలలో నటి భర్తతో కలిసి ఓ ఆసుపత్రి వద్ద కనిపించిన ఫొటోలు వైరలయ్యాయి. ఈనేపథ్యంలోనే స్పందించిన అమృత తాను తల్లి కాబోతున్నట్లు స్పష్టం చేసింది. ఆదివారం ఆమె పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.