దేవుడిపై భారం మోపిన కోల్ కతా

ఐపీఎల్ 13 సీజన్ ఆఖరి అంకానికి చేరింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా పోటీ పడుతున్నాయి. అయితే కోల్ కతా ప్లే ఆఫ్ కి చేరడం ఆ దేవుడి చేతుల్లోనే ఉందన్నారు ఆ జట్టు కెప్టెన్ మోర్గాన్.

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. అనంతరం ఛేదకు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 131 పరుగులకే పరిమితమైంది.

ఘోర పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే టాప్‌-4 రేసులో కోల్‌కతా నిలవాలంటే దిల్లీ×బెంగళూరు, ముంబయి×హైదరాబాద్‌ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్‌ పరాజయాన్ని చవిచూస్తే కోల్‌కతా 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ వార్నర్‌సేన విజయం సాధిస్తే దిల్లీ×బెంగళూరు మ్యాచ్‌లో ఓటమిపాలయ్యే జట్టు నెట్‌రన్‌రేటు ఆధారంగా కోల్‌కతాకు అవకాశం ఉంటుంది.