వైరల్ : కాజల్ పెళ్లి వెడ్డింగ్ పార్టీ ఫోటోస్


స్టార్ హీరోయిన్ కాజల్ తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుని పెళ్లాడింది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం వీరి పెళ్లి వివాహ వేడుక జరిగింది. కరోనా విజృంభణ  నేపథ్యంలో కుటుంబ వేడుకగా పెళ్లి వేడుకని నిర్వహించారు. పెళ్లి తర్వాత అతిథుల కోసం పార్టీ ఏర్పాటు చేశారు. ముంబై తాజ్‌ హోటల్‌లోనే ఈ కార్యక్రమం కూడా జరిగింది.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌ మోడ్రన్‌ డ్రెస్‌లో, కిచ్లు సూట్‌లో సందడి చేశారు. ఈ వేడుకలో సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

మరోవైపు కాజల్‌ వివాహం నేపథ్యంలో సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అనుష్క, సమంత, కీర్తి సురేశ్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి, అమలాపాల్‌, సోనూ సూద్‌, హన్సిక, రాశీ ఖన్నా, నివేదా థామస్‌, లావణ్య త్రిపాఠి, నిహారిక, ప్రియమణి, సుశాంత్‌, అనసూయ తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు.