రోహిత్ వివాదంపై రవిశాస్త్రి స్పందన
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మని ఆస్ట్రేలియా టూర్ కి ఎంపిక చేయకపోవడంపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగానే రోహిత్ ని ఎంపిక చేయలేదని చెబుతున్నారు. అయితే రోహిత్ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ కనపడడంతో నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఎంపిక చేయకపోవడంపై కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లే రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు సెలక్టర్లు ఎంపిక చేయలేదని రవిశాస్త్రి చెప్పాడు. రోహిత్ మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని బీసీసీఐ వైద్య బృందం నివేదిక ఇచ్చిందని, పునరాగమనానికి తొందరపడొద్దని అతడికి సూచించిందని తెలిపాడు. ఇందులో మా ప్రమేయమేమీ లేదు. వైద్య బృందం సెలక్టర్లకు నివేదిక సమర్పించింది. సెలక్టర్లు తమ పని తాము చేశారు. ఇందులో నా పాత్రేమీ లేదని చెప్పుకొచ్చాడు.