#RRR’లో జ‌లియ‌న్ వాలాబాగ్  ఏపీసోడ్ ?

భార‌త స్వాతంత్య్ర ఘ‌ట్టంలో అత్యంత చేదైన ఘ‌ట‌న జ‌లియ‌న్ వాలాబాగ్ ఉదంతం. జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ హింసాత్మ‌క పోక‌డ‌ల‌కు సాక్ష్యం. విచ‌క్ష‌ణా ర‌హితంగా చేసిన కాల్పుల‌లో దాదాపు వేయి మంది భార‌తీయులు మ‌ర‌ణించారు. ఈ దుర్ఘ‌ట‌న త‌ర‌వాత‌… తెల్ల‌దొర‌ల్ని దేశం నుంచి త‌రిమి కొట్టాల‌న్న క‌సి, కోపం యువ‌త‌రంలో బాగా క‌లిగాయి. ఇప్పుడీ ఈ ఏపీసోడ్ ని దర్శకధీరుడు రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’లో చూపించబోతున్నాడని సమాచారమ్.

స్వాతంత్య్ర సరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితకథలోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా ‘ఆర్ఆర్ఆర్’ కథ రాసుకొన్న రాజ‌మౌళి చెప్పారు. ఇద్ద‌రు దేశ భ‌క్తుల గురించి చెబుతూ… దేశ భక్తిని ర‌గిల్చే ఎపిసోడ్ లేక‌పోతే ఎలా? అందుకే స్వాతంత్య్ర సంగ్రామంలో కీల‌క‌మైన కొన్ని ఘట్టాల్ని RRR లో మేళ‌వించ‌బోతున్నాడ‌ని టాక్‌. అందులో భాగంగా జ‌లియ‌న్ వాలాబాగ్ ఉదంతాన్నీ వెండి తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.