ఓటీటీలోకి సినిమాలు క్యూ.. !

కరోనా లాక్‌డౌన్ తో థియేటర్స్ మూతపడ్డాయ్. థియేట‌ర్లు లేని లోటు కొంత వ‌ర‌కూ ఓటీటీలు తీరుస్తున్నాయ్. చిన్నా చిత‌కా సినిమాల‌తో పాటు… వి, నిశ్శ‌బ్దం, పెంగ్విన్‌ లాంటి సినిమాల్ని ఓటీటీలోనే చూడ‌గ‌లిగాం. ఇక ఈ నెలలో ఓటీటీలోకి సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. దాదాపు 7 తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయ్. ఇతర బాషలకి చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

న‌వంబ‌రు 4న ‘మిస్ ఇండియా’ రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కీర్తి సురేష్ న‌టించిన సినిమా ఇది. సూర్య న‌టించిన `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాపై కూడా చాలా ఆశ‌లే ఉన్నాయి. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. న‌వంబ‌రు 12న ఈ చిత్రాన్ని అమేజాన్ లో చూడొచ్చు. ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఈనెల 20న విడుద‌ల అవుతోంది. `గ‌తం` అనే చిన్న సినిమాని అమేజాన్ లో న‌వంబ‌రు 6 నుంచి చూడొచ్చు. (ఆహా), మా వింత గాధ వినుమా (ఆహా), అన‌గ‌న‌గా అతిథి (ఆహా) రెండూ… న‌వంబ‌రు 13న రాబోతున్నాయి.