తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఆర్టీసీ ఒప్పందం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఒప్పందం కుదిరింది. దీంతో రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడవనున్నాయి. కిలో మీటర్ల చొప్పున బస్సు నడపాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ సమక్షంలో ఎంవోయూల మీద సంతకాలు చేసుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం ఏపీకి తెలంగాణ నుంచి 826 ఆర్టీసీ బస్సులు తిరుగనుండగా తెలంగాణకు ఏపీ నుండి 638 బస్సులు తిరగనున్నాయి. విజయవాడ రూట్ లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగానుండగా అదే రూట్ లో 192 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. కర్నూల్ టు హైదరాబాద్ రూట్ లో 213 బస్సులు టి ఎస్ ఆర్ టి సి తిప్పనుంది.

అలానే గుంటూరు హైదరాబాద్ వయా వాడపల్లి రూట్ లో టి ఎస్ ఆర్ టి సి 57 బస్సు తిప్పనుంది ఇక అదే రూట్ లో ఏపీఎస్ ఆర్టీసీ 88 బస్సులు తిప్పనుంది. మాచర్ల సెక్టార్లో టి ఎస్ ఆర్ టి సి 66 బస్సులు తిప్పనండగా ఏపీ బస్సులు 61 తిరగనున్నాయి. నూజివీడు, తిరువూరు, భద్రాచలం-విజయవాడ రూట్‌లో 48 టీఎస్ ఆర్టీసీ బస్సులు, 45 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం రోడ్‌లో 35 టీఎస్ ఆర్టీసీ బస్సులు , 58 ఏపీ బస్సులు నడవనున్నాయి.