దుబ్బాకలో 12.74 శాతం పోలింగ్‌ (9గంటల వరకు)

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్‌ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.

ఓటర్లు సమాజిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నియోజక వర్గ పరిధిలో 315 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ఉన్నతాధికారులు ఓటర్లకు ఇది వరకే విజ్ఞప్తి చేశారు.. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస నుంచి సుజాత రామలింగారెడ్డి, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు.