బెంగళూరు ఓడినా.. నిలిచింది !
ఐపీఎల్ 13 ఆఖరి అంకానికి చేరుకుంది. ప్లేఆఫ్ బర్త్ కోసం అన్ని జట్లు కసిగా ఆడుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (50; 41 బంతుల్లో, 5×4), డివిలియర్స్ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన దిల్లీ 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అజింక్య రహానె (60; 46 బంతుల్లో, 5×4, 1×6), శిఖర్ ధావన్ (54; 41 బంతుల్లో, 6×4) అర్ధశతకాలతో అదరగొట్టారు. అయితే ఓడినా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు చేరింది. ఈరోజు ముంబై-హైదరాబాద్ మ్యాచ్ ఆధారంగా పాయింట్ల పట్టికలో బెంగళూరు స్థానం ఖరారు కానుంది.
ముంబైతో మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే.. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి వెళ్తోంది. బెంగళూరు నాల్గో స్థానానికి వెళ్తుంది. ఒకవేళ హైదరాబాద్ ఓడితే బెంగళూరు మూడో స్థానంలో కోల్ కతా నాల్గో స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్ కు ప్లేఆఫ్ అవకాశాలుండవ్.