‘17.3 మార్కు’ గురించి అప్పటి వరకు కోహ్లీకి తెలియదా ?
సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పడిక్కల్(50) మరో అర్ధ శతకంతో మెరిశాడు. అనంతరం దిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో రెండో స్థానం సంపాదించుకుంది.
మరోవైపు బెంగళూరు 17.3 ఓవర్లలోనే ఓడిపోయి ఉంటే కోల్‌కతా కన్నా తక్కువ రన్‌రేట్ సాధించేది. దాంతో ఆ జట్టు పరిస్థితి తారుమారయ్యేది. దీని గురించి మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడారు. ఇదో విచిత్రమైన పరిస్థితి అని, తాను ముందే చెప్పినట్లు గెలవడం కోసమే ఆడతామని అన్నాడు. దిల్లీ ఛేదన చేస్తుండగా 11వ ఓవర్ తర్వాత తమ జట్టు యాజమాన్యం 17.3 మార్కును గుర్తు చేసిందని చెప్పాడు. ఈ క్రమంలోనే తాము మధ్యలో బాగా ఆడమని, లేకపోతే దిల్లీ అప్పటికే మ్యాచ్‌ను గెలిచేదని తెలిపాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరడం సంతోషంగా ఉందన్నాడు.