కాజల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటన.. ఇకపై సినిమాలకి దూరం !
చందమామ కాజల్ పెళ్లి కాగానే మాట మార్చేసింది. ‘పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా. అందుకు గౌతమ్ ఒప్పుకున్నారు’ – పెళ్లికి ముందు కాజల్ నుంచి వచ్చిన ప్రకటన ఇది. అయితే పెళ్లై వారం కూడా తిరక్కముందే కాజల్ మాట మార్చేసింది. తాజాగా కాజల్ తన ఇన్ స్టా గ్రాములో ఓ లేఖని షేర్ చేసింది.
ఇందులో ఇకపై జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. కఠిన నిర్ణయాలు తీసుకుంటా. కరోనా లాక్డౌన్ తర్వాత జీవితంపై తన దృక్పథం మారింది. ఎంత శ్రమ అయినా సరే.. కఠిన నిర్ణయాలు తీసుకుంటా. జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చింది. సినిమాలకి దూరంగా ఉంటానని కాజల్ నేరుగా చెప్పకపోయినా.. లేఖ సారాంశం మాత్రం అదే అన్నట్టుగా ఉంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఆచార్య, మోసగాళ్లు, భారతీయుడు 2 సినిమాలని పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలని పూర్తి చేసి.. కొత్త సినిమాలని ఒప్పుకోవద్దని కాజల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కాజల్ కి గౌతమ్ 10యేళ్లుగా తెలుసట. అతడితో మూడేళ్లు డేటింగ్ చేసిందట. ఫైనల్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కాజల్ తెలిపింది.