బన్నీ సినిమాపై కాపీ మరక.. క్లారిటీ !
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఊరట లభించింది. బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమా.. హాలీవుడ్ సినిమా ‘యాంట్ వోన్ ఫిషర్’కు కాపీ అంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమా పవన్ – త్రివిక్రమ్’ల ‘అజ్ఝాతవాసి’ మాదిరిగా భారీ డ్యామెజ్ తప్పదేమోనని అభిమానులు భయపడిపోయారు. ఐతే, వీరి భయాన్ని, అనుమానాలని చిత్రబృందం దూరం చేసింది.
‘నా పేరు సూర్య’ కాపీ మరక న్యూస్ చిత్రబృందం చెవిన పడింది. దీంతో.. ఈ ప్రచారంపై చిత్రబృందం స్పందించింది. ‘నా పేరు సూర్య’ ఏ సినిమాకి కాపీ కాదదు. ఇది ‘యాంట్ వోన్ ఫిషర్’ అనే హాలీవుడ్ సినిమాకు రిమేక్ అన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీంతో.. బన్నీ అభిమానులు ఊపిరిపీల్చుకొన్నారు. ఇక, రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ జతకట్టనుంది. ఈ సినిమాని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.