చీటింగ్ కేసులో నిర్మాతకు మూడేళ్ల జైలు

కోలీవుడ్ స్టార్ విజయ్‌తో రెండు సూపర్‌హిట్‌ సినిమాలను తీసిన నిర్మాత స్వర్గాచిత్ర అప్పచాన్. చీటింగ్ కేసులో ఇతడికి మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. 

కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ నటించిన అళగియ తమిళ్ మగన్‌ సినిమా సమయంలో విజయ్ తండ్రి ఏఎస్‌ చంద్రశేఖర్‌తో కోటి రూపాయాలను తీసుకున్న అప్పచాన్‌.. దాన్ని తిరిగి ఇవ్వలేదు. దీనిపై చాలా సంవత్సరాల తరువాత కేసు నమోదైంది. ఇప్పుడీ.. ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించంది. మూడేళ్ల జైలు శిక్ష విధించింది.