గంగూలీని ఇబ్బంది పెడుతున్న రోహిత్ శర్మ
టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ తీరు బీసీసీఐ బాస్ గంగూలీకి ఇబ్బందిగా మారింది. రోహిత్ విషయంలో గంగూలీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయపడ్డ రోహిత్ శర్మకి ఆస్ట్రేలియా పర్యటనలో సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఐపీఎల్ ఆడటంపై ఆలోచించుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సైతం సూచించారు.
సుదీర్ఘ కెరీర్లో అతడికి ఇదే చివరి లీగ్, సిరీస్ కాదని పేర్కొన్నారు. ఆలోచించుకోగల పరిణతి అతడికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
అయితే ఇవేమీ పట్టనట్టు హిట్‌మ్యాన్ ముంబయి తరఫున బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌పై బీసీసీఐ చర్యలు తీసుకోగలదా? అని మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశ్నించారు. టీమ్ఇండియా కన్నా ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీకి ఆడటం అంత కీలకమా? జాతీయ జట్టు కన్నా ఒక క్లబ్ ముఖ్యమా? బీసీసీఐ ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోగలదా? లేదా రోహిత్ గాయాన్ని అర్థం చేసుకోవడంలో బీసీసీఐ ఫిజియో విఫలమయ్యారా ? అని వెంగీ ప్రశ్నించారు.