యాక్షన్’తో ప్రేమ వెనక్కి తగ్గింది
మెగా యంగ్ హీరోల యుద్ధానికి ‘ఫిబ్రవరి 9’న ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాలు అదే రోజు రిలీజ్ డేటుని ప్రకటించేశాయి. దీంతో.. మెగా బాక్సాఫీసు యుద్ధం, బావబామ్మర్థుల యుద్ధం అంటూ సోషల్ మీడియా వేడికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ హాట్ హాట్ కామెంట్స్’కు చెక్ పెట్టేందుకు మెగా కాంపౌండ్ చర్యలు తీసుకొంది.
మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజు-లావణ్య త్రిపాఠి జంటగా ‘ఇంటిలిజెంట్’ తెరకెక్కింది. ఇదో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజు-రాశీఖన్నా జంటగా తెరకెక్కిన “తొలిప్రేమ” ఔట్ అండ్ ఔట్ లవ్ ఎంటర్టైనర్. ఐతే, ఫైనల్’గా యాక్షన్’కు ప్రేమ వెనక్కి తగ్గింది. వరుణ్ తేజు ‘తొలిప్రేమ’ రిలీజ్ ఓ రోజు వెనక్కి వెళ్లింది. ముందుగా ప్రకటించిన ఫిబ్రవరి 9న కాకుండా ఫిబ్రవరి 10న ‘తొలిప్రేమ ‘ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వాయిదా వెనక మెగా యాక్షన్ ఉన్నట్టు సమాచారమ్.
ఒకరోజు తేడాతో బాక్సాఫీసు యుద్ధానికి దిగుతున్న మెగా యంగ్ హీరోల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. వీరిద్దరిలో వరుణ్ తేజు పరిస్థితి కాస్త బెటర్ గా ఉంది. కూల్ గా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు. ఇదీగాక, ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో వస్తున్నాడు. ఇక, సాయిధరమ్ తేజు ‘తిక్క’ సినిమా నుంచి లెక్క తప్పాడు. ఆయన చేసిన విన్నర్, జవాన్ సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడీ యంగ్ హీరో ఆశలన్నీ దర్శకుడు వినాయక్ పైనే పెట్టుకొన్నాడు. మరీ.. ఈ మాస్ దర్శకుడు తేజుకు హిట్ ఇస్తాడేమో చూడాలి.