సాయి పల్లవి సూర్యని కూడా లెక్కచేయడం లేదట !
‘ఫిదా’ సినిమాతో ఫేమస్ అయిపోంది హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్’లో ఫుల్ బిజీ. మరోవైపు, కోలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఏకంగా తమిళ్ స్టార్, ఆమె అభిమాన నటుడు సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తన అభిమాన హీరో సరసన ఇంత త్వరగా ఛాన్స్ తగులుతుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆ మధ్య సాయిపల్లవి చెప్పింది. తీరా షూటింగ్ స్పాట్ లో సూర్యకు చుక్కలు చూపిస్తుందట.
నాని ‘ఎంసిఎ’ సమయంలోనే సాయి పల్లవి తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఆమె వ్యవహార శైలి చిత్రబృందాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టేలా ఉంటుందట. షూటింగ్’కు సమయానికి రాదట. వచ్చిన మానిటర్ దగ్గర కూర్చుండిపోయి ఉంటుందట. ఈ క్రమంలోనే ఎం.సి.ఎ షూటింగ్ సమయంలో నాని-సాయి పల్లవికి గొడవ జరిగింది. వీరిద్దరికి కొన్నాళ్లు మాటల్లేవ్. చివరకు దిల్ రాజు కల్పించుకొని పరిస్థితిని చక్కదిద్దినట్టు వార్తలొచ్చాయి.
‘కణం’ సినిమా షూటింగ్ సమయంలోనూ నాగ శౌర్యకు చుక్కలు చూపిందట ఈ ఫిదా పోరి. ప్రస్తుతం తమిళంలో సూర్య జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఇప్పుడు కూడా షూటింగుకి ఆలస్యంగా వస్తూ, అందరినీ ఇబ్బంది పెట్టేస్తోందట. షూటింగ్ స్పాట్ లోను ఆమె వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. చేసిన రెండు, మూడు సినిమాలకే ఈ రేంజ్ పైత్యం పనికి రాదనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇది ఆమె కెరీర్ కు కూడా మంచిది కాదు.