ముంబై-హైదరాబాద్ మ్యాచ్ ఫిక్సయిందా ?

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ముంబయిని చిత్తుగా ఓడించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఐపీఎల్ లో బలమైన జట్టు.. మొదట ప్లేఆఫ్ కి చేరిన ముంబై జట్టు హైదరాబాద్ పై చిత్తుగా ఓడటంపై సదరు ప్రేక్షకుడికి అనుమానం కలిగింది. మ్యాచ్ ఫిక్సయిందా? అని చర్చించుకుంటున్నారు. గెలుపు, ఓటమి సహజమే. కానీ మరీ ఇంత ఘోరంగానా? అని ప్రశ్నిస్తున్నారు.

అటు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఇటు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడూ కూడా ముంబై ఆటగాళ్లలో ఏమాత్రం కసి కనిపించలేదు. బూమ్రా, బౌల్ట్ లేకుంటే ముంబై ఇంత దరిద్రమా ? అని చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ బౌలింగ్ లో అదరగొట్టేసింది. అదే పిచ్ పై ముంబై సింగిల్ వికెట్ కూడా తీయలేకపోయింది. అందుకే.. ఈ మ్యాచ్ ఫిక్సయిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అయితే.. క్రికెట్ లో ఇలాంటి షాకింగ్ చెత్త ప్రదర్శనలు సహజమే. గతంలోనూ ఇలాంటి మ్యాచ్ లని ప్రేక్షకులని చాలానే చూశారు. 

ఇక నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు చేసింది. పొలార్డ్ (41; 25 బంతుల్లో, 2×4, 4×6) టాప్‌ స్కోరర్‌. ఆ జట్టును సందీప్‌ శర్మ (3/34) దెబ్బతీశాడు. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్‌ 17.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (85; 58 బంతుల్లో, 10×4, 1×6), వృద్ధిమాన్‌ సాహా (58; 45 బంతుల్లో, 7×4, 1×6) అజేయ అర్ధశతకాలతో అదరగొట్టారు.