బిగ్ సప్రైజ్ : రాధేశ్యామ్ లో అనుష్క గెస్ట్ రోల్


బాహుబలి ప్రభాస్’కు స్వీటీ అనుష్క సరిజోడి. ప్రభాస్ కొత్త సినిమా అనగానే అనుష్క హీరోయిన్ అయితే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులని ప్రభాస్ సప్రైజ్ చేయనున్నారట. ఆయన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్.

ఇటీవలే ఇటలీ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి తిరిగొచ్చింది. మిగిలిన భాగం ఇక్కడ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ నిర్మించి అందులో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనుష్క ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు. సినిమాని చూసిన ప్రేక్షకులని సప్రైజ్ చేసేందుకు ఇలా ప్లాన్ చేసారని చెబుతున్నారు.