పాపం.. కాజల్  కాళ్ల పారాణి ఆరక ముందే.. !


చందమామ కాజల్ ఇటీవ‌లే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే మొగుడికి దూరం కావొస్తుందట. అలాగని ఇదేదో బ్రేకప్ స్టోరీ కాదు. బ్రేక్ స్టోరీ. అవునూ..  పెళ్లి తర్వాత సినిమా పనులేవీ కాజల్ పెట్టుకోలేదు. కొన్ని రోజులు భర్తతో హాయిగా గడిపిన తర్వాత.. సినిమాల గురించి ఆలోచిస్తారు అనే ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదట.

అతి త్వరలోనే ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ నెల 10 నుంచే ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందట. అందుకే పాపం.. కాజల్ కాళ్ల పారాణి కూడా ఆరక ముందే షూటింగ్ లో పాల్గొనబోతుందని ఆమె అభిమానులు చెప్పుకొంటున్నారు. పెళ్లికి ముందు ఇచ్చిన క‌మిట్‌మెంట్స్‌ను గాలికి విడిచి పెట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టం చేయ‌కూడ‌ద‌ని కాజల్ డిసైడ్ అయినట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 10న షూటింగ్‌లో పాల్లొనేందుకు ఆమె ఏర్పాట్టు చేసుకున్నారు.  తమిళంలో ‘హే సినామికా’ పేరుతో తెర‌కెక్కుతున్న సినిమాలో  హీరో దుల్కర్‌ సల్మాన్ స‌ర‌స‌న కాజ‌ల్‌ న‌టిస్తున్నారు. దీంతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలోనూ ఆమె నటించనున్నారని తెలుస్తోంది. ఇవీగాక మోసగాళ్లు, భారతీయుడు 2 సినిమాలని కాజల్ పూర్తి చేయాల్సి ఉంది.