అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్


అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడన్ గెలుపు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్‌ ఓట్లను బైడెన్‌ సొంతం చేసుకున్నారు. మరో 6 ఎలక్టోరల్‌ ఓట్లు సాధిస్తే ఆయన మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి రేస్‌ నుంచి దాదాపుగా తప్పుకున్నారు. 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్‌ పూర్తవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

దాదాపు విజయం ఖాయమైన నేపథ్యంలో బైడన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మనం విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. ఆ విజయం నా ఒక్కడిదే కాదు. అది అమెరికా ప్రజల విజయం’ అని ట్విట్ చేశారు. ‘ఎన్నికల ఫలితాలను డొనాల్డ్‌ ట్రంప్‌ కానీ.. నేను కానీ, నిర్ణయించలేము. అమెరికా ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. అందుకే మేము బైడెన్‌ ఫైట్‌ ఫండ్‌ను తీసుకొచ్చాం. ప్రతీ ఓటు పరిగణలోకి వస్తుంది. ఫండ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల పరిరక్షణ చర్యలకోసం వినియోగిస్తాం’ అని రాసుకొచ్చారు.