నితిన్ సినిమా హాటు.. తగ్గిస్తారట 

హిందీ హిట్ ‘అంథాధూన్’ తెలుగు రిమేక్ చేస్తున్నారు నితిన్. హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో రాధిక ఆప్టే నటించిన పాత్రలో నభా కనిపించనుంది. హిందీ వెర్షన్ లో రాధిక హాట్ హాటుగా కనిపించింది. ఆ ఘూటు తెలుగులోనూ  ఉండనుందా ? అంటే.. అబ్బే ఆ ఛాన్స్ లేదంటున్నారు.

ఎందుకంటే ? తెలుగు వర్షన్ లో భారీ మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ కి కత్తెరపెడుతున్నారు. మాతృకలో టబు పాత్ర కూడా బోల్డ్ గా ఉంటుంది. ఆ పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ పాత్ర డోస్ కూడా తగ్గిస్తారని తెలిసింది. అంధాధూన్ రీమేక్ లో తన క్యారెక్టర్ కు సౌత్ టచ్ ఉంటుందని హీరోయిన్ నభా చెప్పుకొచ్చింది  చేందుకు తమన్న ఒప్పుకుంది. ఈ నెలాఖరు నుంచి అంధాధూన్ తెలుగు రీమేక్ షూటింగ్ మొదలవ్వనుంది.