తిరుమలలో కొత్త రూల్.. ఏంటంటే ?

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదల్లేదు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా దేవాలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయాన్ని కూడా కొన్నాళ్లపాటు మూసేవేశారు. అయితే తిరిగి తెరిచిన తర్వాత తిరుమలకి క్రమంగా రదీపెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కఠిన నిబంధనలని పాటిస్తూ.. భక్తులని స్వామివారి దర్శనానికి అమతిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కొత్త రూమ్ తీసుకొచ్చారు. తిరుమలకు వచ్చే వాహనాలపై అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు పదేళ్ల కాలపరిమితి దాటిన వాహనాలలో తిరుమలకు రావొద్దని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్ అలిపిరి వద్ద వాహనాల కాలపరిమితిని పరిశీలించి కొండపైకి అనుమతిస్తున్నట్టు తెలిపారు. కాలపరిమితి దాటిన వాహనాలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.