ఆ.. మాట’కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆయన మాటకు పదునెక్కువ. ఆ మాటతో మురిపిస్తాడు. మందలిస్తాడు. ప్రేమిస్తాడు. హెచ్చరిస్తాడు. ఏడిపిస్తాడు కూడా. ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఆ మాట ఎవరిదో.. ? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. మాటలకే మాటలు చెప్పి మెప్పించే.. మలల్ని మరో లోకంలో తీసుకెళ్తాడు. వాటితో మన ఇంటి వస్తాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకే త్రివిక్రమ్ రాతతో మాటకు మరింత విలువ పెరిగింది. ఆ మాటల మాంత్రికుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

త్రివిక్రమ్ కు తొలిసారి ‘స్వయంవరం’ సినిమాకు సంభాషణలు రాసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ‘నువ్వేకావాలి’, ‘చిరునవ్వుతో..’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘నువ్వునాకు నచ్చావ్‌’, చిత్రాలకు సంభాషణలు రాశారు. తొలిసారి మెగాఫోన్‌ పట్టి తరుణ్‌తో తీసిన ‘నువ్వే నువ్వే’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్‌ రచయిగా కొనసాగారు.
‘వాసు’, ‘మన్మథుడు’, ‘ఒకరాజు ఒకరాణి’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ’ చిత్రాలకు మాటల రాశారు. ‘చిరునవ్వుతో..’ రచయితగా నంది అవార్డు తెచ్చిపెట్టిన తొలి చిత్రం. త్రివిక్రమ్‌. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన ‘అతడు’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా మారారు. స్టార్ హీరోలు సైతం త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసే పరిస్థితి.

ఇక ఈ యేడాది ‘అల.. వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తివిక్రమ్. ఆయన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండనుంది. అయితే తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి రావాలి. ఇందుకు టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ మరిన్ని సినిమాలతో ప్రేక్షకులనిమురిపించాలని, నడిపించాలని కోరుకుంటూ.. ఆయనకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తొంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.