హైదరాబాద్’లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

గతంలో భాగ్యనగరంలో డబుల్ డెక్కన్ బస్సులు సందడి చేసేవి.  నిజాం కాలంలో ‍డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉండేవి. అయితే కాలక్రమేణా హైదారాబాద్‌లో అవి కనుమరుగయ్యాయి. తాజాగా షాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది.

దీనిపై స్పందించిన కేటీఆర్..  ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్‌. వీటిని తిరిగి తెచ్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో..? పరిశీలించమని కేటీఆర్ తన ట్వీట్ ద్వారా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ ఆజయ్‌ కుమార్‌ను కోరారు. ఈ నేపథ్యంలో హైదారాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కన్ బస్సులు వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు.