హైదరాబాద్’లో సినిమా సిటీ.. ప్రకటించిన సీఎం కేసీఆర్ !
టాలీవుడ్ కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్ నగర శివారులో 1500 నుంచి 2000 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ప్రగతిభవన్ లో సీఎంని కలిశారు. ఈ సందర్భంగా సినిమా సిటీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.
సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు’సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.