సీఎం కేసీఆర్’లో కరోనా కలవరం 

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ లో కరోనా కలవరం మొదలైంది. శనివారం టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున సీఎం కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో భారీ వర్షాలు-వరదల సమయంలో ప్రకటించిన విరాళాలకి సంబంధించిన చెక్ లని సీఎం కేసీఆర్ కు అందించారు. అదే సమయంలో థియేటర్స్ రీ ఓపెన్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో చిరు, నాగ్ సన్నిహితంగా మెలిగారు.

తాజాగా చిరంజీవికి కరనా పాజిటివ్ అని తేలింది. ఆచార్య షూటింగ్ కోసం ముందస్తుగా చేయించుకున్న టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా వచ్చింది. తనకి లక్షణాలేమీ లేవు. డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయా. ఇటీవల తనని కలిసిన వారు జాగ్రత్తగా ఉండండి. కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరు ట్విట్ చేశారు.

చిరు చెప్పిన ఈ నాలుగు రోజుల జాబితాలో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి నడిచే సమయంలో చిరు మాస్క్ కూడా పెట్టుకోలేదు. సీఎం కేసీఆర్ కూడా మాక్స్ ధరించలేదు. ఈ నేపథ్యంలో చిరు నుంచి కేసీఆర్  కి కరోనా సోకే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా కరోనా టెస్టు చేయించుకొనేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.