అమ్మా.. వదిలించుకున్నారు !
ప్రేక్షకుల ఒత్తిడికి బిగ్ బాస్ తలొగ్గక తప్పలేదు. గత వారమే అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఆ వారం అనారోగ్యంతో నోయల్ వెళ్లిపోవడం.. ఆయన కోరిక మేరకు ఆ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అమ్మా.. ని సేవ్ చేశారు. ఆ తర్వాతి వారానికి కూడా ఆయన్ని సేవ్ చేసేందుకు బిగ్ బాస్ స్కెచ్ వేశాడు.
అమ్మా.. ని నేరుగా కెప్టెన్ పోటీ దారుడిగా ఎంపిక చేశారు. ఆ పోటీలో గెలిచి ఆయన కెప్టెన్ అయ్యారు. దీంతో ఈ వారం కూడా అమ్మా.. సేవ్ అవుతారని అనుకున్నారు. కానీ అమ్మా.. ని బిగ్ బాస్ సేవ్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయ్. వాటికి తలొగ్గిన బిగ్ బాస్ కెప్టెన్ గా ఎంపికైన అమ్మాని కూడా ఎలిమినేట్ చేశారు. అయితే చివరల్లో అమ్మా, అవినాష్ డబుల్ ఎలిమినేషన్ అంటూ టెన్షన్ పెట్టిన నాగ్.. చివరికి అమ్మాని మాత్రమే ఎలిమినేట్ చేసి.. అవినాష్ ని సేవ్ చేశారు.