కోహ్లీ స్థానంలో రోహిత్’కు కెప్టెన్సీ బాధ్యతలు

ఐపీఎల్ లో కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్  పరాజయాల పరంపరం కొనసాగుతూనే ఉంది తాజా ఐపీఎల్ లోనూ ఆ జట్టు ఫైనల్ కి చేరలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతలని తప్పించాలి. ఆయన కెప్టెన్ గా ఉన్నని రోజులు ఆర్సీబీ కప్ గెలవదనే విమర్శలొచ్చాయ్.

ఈ విషయం పక్కనపెడితే.. తాజాగా కోహ్లీ స్థానంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలని రోహిత్ శర్మకి ఇచ్చారు. అలాగని శాశ్వతంగా కాదు.  టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వపు సెలవులను మంజూరు చేసింది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. కాన్పు సమయంలో ఆమె చెంతనే ఉండాలనే ఉద్దేశంతో విరాట్‌ సెలవులు తీసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు తిరిగొస్తాడని బీసీసీఐ తెలిపింది. తొడ కండరాల గాయం వల్ల తొలుత ఎంపికవ్వని రోహిత్ శర్మను టెస్టు జట్టులోకి తీసుకుంది. ఆయనకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. రోహిత్‌ను బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. సెలక్షన్‌ కమిటీకీ ఇదే విషయం చెప్పాం. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకే అతడిని సంప్రదించి వన్డే, టీ20 సిరీసుల్లో విశ్రాంతినిస్తున్నాం. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి ఎంపిక చేశామని బీసీసీఐ కార్యదర్శి జే షా.