అక్కడ.. ఇకపై సహజీవనం చట్టబద్దమే !

దుబాయ్ లో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయ్. అక్కడ సహజీవనం, మద్యపానం నేరం. అయితే ఇప్పుడు ఆ దేశంలో చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. మద్యపానం సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది. అవివాహిత జంటలు ఒకేచోట నివసించేందుకు అనుమతించడంతో పాటు మద్యపానంపై నియంత్రణలను సరళతరం చేసస్తూ ఇస్లామిక్‌ వ్యక్తిగత చట్టాల్లో కీలక మార్పులను యూఏఈ ప్రకటించింది.

పెట్టుబడుల వాతావరణం, చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సంస్కరణలను చేపట్టామని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయంతో 21 సంవత్సరాలు పైబడిన వారు స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు. యూఏఈ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు.