ఐపీఎల్ ఫైనల్ : ఆ రెండు సెంటిమెంట్స్ రిపీట్ అయితే ఢిల్లీ’దే విజయం
ఐపీఎల్2020 ఫైనల్ ముంబై-ఢిల్లీ జట్ల మధ్య ఈరోజు జరగనుంది. ఈ రెండింటిలో ముంబైనే టైటిల్ ఫేవరేట్ అయినా.. రెండు సెంటిమెంట్లు ఆ జట్టుని టెన్షన్ పెడుతున్నాయ్. ప్రతీ లీప్ సంవత్సరంలో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది.
ప్రారంభ సీజన్ 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ అందుకోగా.. 2012లో కోల్‌కతా నైట్ రైడర్స్.. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా చాంపియన్లుగా నిలిచాయి. ఈ లెక్కన 2020లో ఢిల్లీ తొలి టైటిల్ అందుకోవాల్సి ఉంటుంది.
ఇదీగాక.. ఆర్సీబీ వదులుకున్న ఆటగాళ్లు ఇతర జట్లలో చేరి.. ఆ జట్టుకు కప్ ని అందిస్తున్నారు. 2017లో షేన్ వాట్సన్‌ను కోహ్లీసేన వదిలించుకోగా.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో క్వింటన్ డికాక్‌ను బెంగళూరు వదులుకోగా.. 2019లో ముంబై తరఫున బరిలోకి దిగి మంచి ప్రదర్శన ఇచ్చాడు. 2019లో బెంగళూరు మార్కస్ స్టోయినిస్, హెట్‌మైర్‌లను రిలీజ్ చేయగా.. ఆ ఇద్దరు ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆడుతూ ఫైనల్‌కు చేర్చారు. ఇప్పుడు వీరిద్దరు ఫైనల్ లో అదరగొట్టి ఢిల్లీకి కప్ అందించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.. !