దుబ్బాకలో ముందంజలో భాజాపా
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార తెరాసకు భాజాపా షాకిచ్చేలా కనిపిస్తోంది. దుబ్బాకలో భాజాపా అభ్యర్థి రఘునందన్ రావు తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 11వేలకుపైగా ఓట్ల లెక్కింపు జరగగా.. బీజేపీ 1100పైగా ఓట్ల మెజారిటీతో భాజాపా ఉంది.
దుబ్బాకలో భాజాపా గెలిస్తే మాత్రం తెలంగాణలో భాజాపా వేవ్ మొదలైనట్టే. ఆ ప్రభావం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనిపించనుంది. గ్రేటర్ లో భాజాపా జెండా ఎగురవేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ? దుబ్బాక గెలుపు స్పూర్తిగా అధికార తెరాస నుంచి భాజాపాలోకి వలసలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.