దుబ్బాక ఉపఎన్నిక : కత్తి కార్తీక పరువుపోయింది.. !
దుబ్బాక ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. భాజాపా, తెరాస, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయ్. అయితే ప్రస్తుతం ట్రెండ్ ని బట్టీ చూస్తే భాజాపా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి దాదాపు 4వేల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయ్. మరో 11 రౌండ్ల ఫలితం రావాల్సి ఉంది.
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కార్తీక 176 ఓట్లు పొందారు. ఇదిలా ఉంటే నోటాకు 160 ఓట్లు వచ్చాయి. చూస్తుంటే కార్తీకకి నోటా ఓట్ల కంటే తక్కువగా వచ్చేలా ఉన్నాయ్.