దుబ్బాక కౌటింగ్ : పడిపోతున్న భాజాపా ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠని రేపుతోంది. మొదటి 5 రౌండ్లలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత తెరాస, భాజాపాల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. అనూహ్యంగా 12వ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం చూపించింది. అయితే ఓ దశలో దాదాపు 4వేల పై చిలుకు ఆధికంలో ఉన్న రఘునందన్ రావు.. ఆధిక్యం తగ్గుతో వస్తోంది. 15 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 2,488 ఆధిక్యంలో ఉన్నారు.
ఇక 16వ రౌండ్ లో ఆయన ఆధిక్యానికి గండిపడింది. 16 రౌండ్ పూర్తయ్యేసరికి రఘునందన్ రావు 1,734 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో 6 రౌండ్లని లెక్కించాల్సి ఉంది. మరీ.. స్వల్ప ఆధిక్యంతో భాజాపా గెలుస్తుందా ? లేక ఆఖరులో కారు జోరు చూపించి.. విక్టరీ సాధిస్తుందా?? అన్నది చూడాలి.