దుబ్బాక కౌటింగ్ : భాజాపా 8, తెరాస 7

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం దోబూచులాడుతోంది. ఇప్పటి వరకు 16 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు మొదటి స్థానం, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానం, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొత్తం 15 రౌండ్లలో భాజాపా 8, తెరాస7, కాంగ్రెస్ ఒక్క రౌండ్ లో ఆధిక్యత కనబర్చాయి.

తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్లలో బీజేపీ మెజార్టీ సాధించగా, టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15,16 రౌండ్లలో భారీ మెజార్టీగా దిశగా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్లలో 1500 మెజార్టీ సాధించింది. ఓ దశలో దాదాపు 4వేల పై చిలుకు ఆధికంలో ఉన్న రఘునందన్ రావు.. ఆధిక్యం తగ్గుతో వస్తోంది. 15 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 2,488 ఆధిక్యంలో ఉన్నారు. ఇక 16వ రౌండ్ లో ఆయన ఆధిక్యానికి గండిపడింది. 16 రౌండ్  పూర్తయ్యేసరికి రఘునందన్ రావు 1,734 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో 6 రౌండ్లని లెక్కించాల్సి ఉంది.