దుబ్బాక ఉత్కంఠ పోరులో భాజాపా గెలుపు

తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే. ఇప్పుడీ.. ట్యాగ్ లైన్ చెక్ పెట్టేసింది భాజాపా. దుబ్బాక ఉప ఎన్నికలో భాజాపా గెలుపొందింది. దుబ్బాక ఫలితం ఐపీఎల్ మ్యాచ్ ని మించిన ఉత్కంఠని కలిగించింది. సూపర్ ఓవర్, డబుల్ సూపర్ కి దారితీసిన ఇంతటి ఉత్కంఠ ఉండేమో. మొదట్లో భాజాపా ఆధిక్యం కనబరిస్తే.. ఆ తర్వాత తెరాస ఆధిపత్యం కనబర్చింది. ఇక ఆఖరి మూడు రౌండ్లలో భాజాపా ఆధిక్యం కనబర్చింది. మొత్తంగా వెయ్యికిపైగా భాజాపా అభ్యర్థి రఘునందన్ గెలుపొందారు. 

ఇక రౌండ్ల వారీగా చూస్తే.. 

1 – 341 భాజపా

2 – 794 భాజపా

3 – 124 భాజపా

4 – 1425 భాజపా

5 – 336 భాజపా

6 – 335 తెరాస

7 – 182 తెరాస

8 – 621 భాజపా

9 – 1084 భాజపా

10 – 456 తెరాస

11 – 199 భాజపా

12 – 83 కాంగ్రెస్‌

13 – 304 తెరాస

14 – 288 తెరాస

15 – 955 తెరాస

16 – 749 తెరాస

17 -872 తెరాస

18 – 688 తెరాస

19 – 425 తెరాస

20 – 551 భాజపా

21 – 620 భాజపా

22 – 438 భాజపా 

23 –  భాజపా