దుబ్బాక ఓటమిపై కేటీఆర్ ఏమన్నారంటే ?
దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసకు భాజాపా షాక్ ఇచ్చింది. భాజాపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినకాడి నుంచి వచ్చిన వచ్చిన ప్రతి ఉప ఎన్నికలోనూ తెరాస గెలుస్తూ వస్తోంది. తొలిసారి ఆ పార్టీ భగపాటు కలిగింది. దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ముందుగా దుబ్బాక ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమకి 61వేలపై చిలుకు ఓట్లు వచ్చాయ్. వారికి రుణపడి ఉంటామన్నారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో తెరాస వరుసగా గెలుపొందినా.. ఆ విజయాన్ని తలకెక్కించుకోలేదు. ప్రజల తీర్పుకి అనుగుణంగా పని చేశాం. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి మాలో నిరాశ కలిగించింది. ఈ ఓటమిపై తప్పకుండా సమీక్షించుకుంటాం. ముందుకు సాగుతామన్నారు కేటీఆర్.