అన్నయ్య త్వరగా కోలుకోవాలని తమ్ముడు ప్రార్థనలు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు కరోనా టెస్ట్ చేయించుకోగా చిరుకి కరోనా పాజిటివ్ గా వచ్చింది. తనలో ఎలాంటి లక్షణాల్లేవ్. డాక్టర్ల సూచనల మేరకు హోంఐసోలేషన్ లోకి వెళ్లినట్టు చిరు ట్విట్ చేశారు. దీంతో మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్విట్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. చిరు కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్ ఓ ప్రెస్ నోటు ని రిలీజ్ చేశారు. అన్నయ్య కరోనా టైమ్ లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు కృష్టి చేశారు. అలాంటిది అన్నయ్య కరోనా బారినపడటం షాక్ ని కలిగించింది. అన్నయ్య త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.