గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి కౌంట్ డౌన్ స్టార్ట్

జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ సమావేశం కానుంది. అధికారికంగా గుర్తింపు పొందిన మొత్తం 11 పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపిందింది. వారి నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఒక్కో పార్టీ ప్రతినిధికి 15 నిమిషాల పాటు కేటాయించనున్నారు.

ఇక వచ్చే యేడాది ఫిబ్రవరి 12వ తేదితో జీహెచ్ ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. ఈలోపు ఎన్నికలని నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెలలో ఎన్నికలని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు షెడ్యూల్‌ విడుదలైంది. ఈరోజుతో (నవంబర్ 12)  పోలింగ్‌ కేంద్రాల జాబితాను రెడీ కానుంది. రేపు పోలింగ్‌ కేంద్రాల జాబితా ముసాయిదాను జీహెచ్‌ఎంసీ విడుదల చేయనుంది. ఈనెల 17 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈనెల 21న వార్డుల వారీగా పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రకటించనున్నారు.