నా లైఫ్ లో లవ్ దొరికింది
నా లైఫ్ లో లవ్ దొరికిందని ప్రకటించింది చిన్నారి పెళ్లి కూతురుఅవికా గౌర్. కాబోయే వాడు మిలింద్ చద్వానీని ప్రేక్షకులకి పరిచయం చేసింది.’నా లైఫ్ లో లవ్ దొరికింది. నన్ను అర్థం చేసుకొని, నాలో స్ఫూర్తి నింపి, నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి దొరకడం నా అదృష్టం. ఇదొక అందమైన అనుభూతి. ఇప్పట్లో తామిద్దరం పెళ్లి చేసుకోం’ అని తెలిపింది.
చిన్నారి పెళ్లి కూతురుతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది అవికా. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మీరావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, సినిమా చూపిస్త మామ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. కాస్త దొబ్బుగా ఉంటే అవికా.. ఇటీవల చాలా స్లిమ్ గా మారింది. హీరోయిన్ గా బిజీగా ఉన్న టైమ్ లోనే చదువు కోసం నటనకి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కాబోయే వాడిని పరిచయం చేసి వార్తల్లోకి ఎక్కింది.