గుడ్ న్యూస్ : చిరుకి కరోనా నెగటివ్
మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్‌గా తేలింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు.
నాలుగు రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు. తాజాగా చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో కరోనా లేదని తేలింది. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించి, తన క్షేమం కోరిన వారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు.