నాలుగున్నరేళ్లు అతడితో తిరిగా.. సారీ అమ్మా.. !!

ఇంటి సభ్యుల గుట్టురట్టు చేశాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులకి కుటుంబ సభ్యుల నుంచి లేఖలు వచ్చాయని చెప్పిన బిగ్ బాస్.. వాటిని పొందాలంటే.. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికి చెప్పని సీక్రెట్ ఒకటి పంచుకోవాలని చెప్పాడు. ఒక్కొకరుగా కన్ఫెషన్ రూంలోకి వచ్చి.. సెక్రెట్ ని విప్పారు. ఈ  క్రమంలో హారిక షాకింగ్ సీక్రెట్ ఒకటి బయటపెట్టింది.

గతంలో ఒకరితో తనకి ఎఫైర్ ఉండేది. దాదాపు నాలుగున్నరేళ్లు అతడితో డేటింగ్ చేశా. నాపై చాలా కేర్ తీసుకోవడంతో పడిపోయా. అతడితో బ్రేకప్ జరిగి రెండున్నరేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఎవ్వరితో ఎఫైర్ పెట్టుకోలేదు. ఈ ఒక్క విషయం మాత్రం మా అమ్మ దగ్గర దాచా. సారీ.. అమ్మా ! అంటూ చెప్పుకొచ్చింది.

అయితే హారిక బయటపెట్టిన సీక్రెట్ మాత్రం అభిజిత్ తల్లిదండ్రులని తీవ్ర నిరాశకు పరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ? బిగ్ బాస్ ఇంట్లో అభిజిత్-హారిక క్లోజ్ గా ఉంటున్నారు. వారిద్దరు ఒప్పుకుంటే వారికి పెళ్లి చేసేందుకు తనకేమీ అభ్యంతరం లేదని అభిజిత్ తల్లి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హారిక డేటింగ్ సీక్రెట్ బయటపెట్టడంతో.. వాళ్లు ఆలోచనలో పడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే ఈ తరంలో అలాంటివి కామనే కదా.. !