ఆమెతో ప్రభుదేవా రెండో పెళ్లి ?
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారమ్. ప్రభుదేవా, అతని భార్య రామలతల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుదేవా రెండో పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రభుదేవా తన బంధువుతో ప్రేమలో పడ్డారని.. ఆమె కూడా ప్రభుదేవా ప్రేమను అర్థం చేసుకుందని.. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోనున్నారంటూ కోలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
గతంలో స్టార్ హీరోయిన్ నయన్ తారతో ప్రభుదేవా ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమ దాదాపు పెళ్లి వరకు వెళ్లింది. ఇంతలో ప్రభుదేవా మనసు మార్చుకున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు కౌన్సిలింగ్ ఇచ్చి నయన్ తో ప్రేమ, పెళ్లికి బ్రేకప్ చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ప్రభుదేవా పేరుతో ఎవరితో కలిసి వినపడలేదు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రభుదేవా రెండో పెళ్లి గురించి తెరపైకి వచ్చింది. అయితే దీనిపై ప్రభుదేవా స్పందించాల్సి ఉంది.
ఇక గతేడాది విడుదలైన ‘దబాంగ్ 3’ చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.