భారత్ కోలుకుంటోంది 

కరోనా నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. క్రమంగా దేశంలో రికవరీ శాతం పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు సంఖ్య ఐదు లక్షల మార్కు కంటే తగ్గడం ఊరట కలిగించే అంశం. గురువారం ఆ కేసులు సంఖ్య 4,84,547 గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 5.63శాతాం. కోలుకున్న వారిశాతం 92.89 శాతంగా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 44,879 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 87,28,795 మంది వైరస్ బారిన పడగా, వారిలో 81,15,580 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 49,079 గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా గురువారం 547 మరణాల సంభవించగా, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 1,28,668 మంది ప్రాణాలు కోల్పోయారు.