భారత్’లోకి మళ్లీ పబ్ జీ గేమ్.. అనుమతి ఎలా ఇచ్చారంటే ?
దేశ సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ పబ్‌జీతో పాటు 118 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం సెప్టెంబరులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్లోకి పబ్‌జీ (ప్లేయర్‌అన్‌నౌన్స్ బాటిల్‌గ్రౌండ్స్) మళ్లీ వస్తోంది. ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’ అనే సరికొత్త గేమ్‌తో తిరిగి అడుగుపెడుతున్నట్లు పబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది.
అప్పుడు బ్యాన్ చేసిన పబ్ జీ గేమ్ కు ఇప్పుడు భారత ప్రభుత్వం ఎందుకు అనుమతిని ఇవ్వబోతుంది అంటే ? పబ్‌జీ మొబైల్ ఫ్రాంఛైజీని భారత్‌లో పంపిణీ చేయడానికి చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్‌కు ఎటువంటి అధికారం లేదని పీబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది. భారత్‌లో అన్ని పబ్లిషింగ్ బాధ్యతలను తామే తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు.. భారత కంపెనీలోకి 100 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలిపింది.