క్రాక్ ఐటమ్ సాంగ్.. భూమ్‌ బద్దలె !

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మాస్‌ మహారాజ్‌ రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. రవితేజకు జంటగా శ్రుతి హాసన్‌ సందడి చేయనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఐటమ్ నెంబర్ ని విడుదల చేశారు. ‘భూమ్‌ బద్దలు.. భూమ్‌ బద్దలు.. నా ముద్దుల సౌండు’ అంటూ సాగే ఈ పాటలో నటి అప్సర రాణి.. రవితేజతో స్టెప్పులేశారు. అదరగొట్టేశారు.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. మంగిలి, సింహా కలిసి పాడారు. థమన్ సంగీతం అందించారు. జానీ మాస్టర్‌ ఈ పాటకు మాంచి మాస్ స్టెప్పులు వేయించారు. పాటలో చూపించిన మేకింగ్‌లో రవితేజ, అప్సర రాణి స్టెప్పులు చూస్తుంటే థియేటర్‌లో ‘భూమి బద్దలు’ కొట్టేలా ఉంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.